![యేసు ప్రభువారి ప్రార్థన నమూనా - Jesus' Blueprint for Prayer [Telugu]](http://dhdindia.in/cdn/shop/products/JesusBlueprntforPrayer_Telugu_HJ981TE-CoverImg_{width}x.png?v=1650617270)
ప్రార్థన అనేది ఒక విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యముగా అవసరమైన భాగము, అయినా ఎన్ని సార్లు మనము చిన్న చిన్న పాప్కార్ను ప్రార్థనలు లేదా మన కోరికల కిరాణా సామాను పట్టికను అడుగుతాము? ప్రార్థన ఒక భాగ్యమే కానీ ఒక ప్రయాస కూడా. దేవుడు, మనము ఆయన్ను తండ్రిగా, సమకూర్చేవారిగా, క్షమించేవారిగా ఇంకా అన్నిటికీ ప్రభువుగా తెలుసుకోవాలని ఉద్దేశము కలిగియున్నారు. "యేసు ప్రభువారి ప్రార్థన నమూనా" “పరలోక ప్రార్థన” మార్గములో నడిపిస్తుంది, ఫలితముగా మనం ఎలా ప్రార్థన చెయ్యాలో తెలుసుకోవడమే కాకుండా మనం ఆయన చిత్తంలోనికి ఎలా ప్రవేశించగలమో తెలుపుతుంది.
హాడన్ డబ్ల్యు. రాభిన్సన్ ఒక ప్రఖ్యాతి వర్థమాణికుడు అలాగే అనేక సంవత్సరాలు “డిస్కవర్ ది వర్డ్ (వాక్యాన్ని కనుగొనండి) అనే రోజువారీ రేడియో కార్యక్రమములో బోధకునిగా ప్రాచుర్యము పొందారు. డాక్టర్ రాభిన్సన్, హారొల్ద్ జాన్ ఓకేంగా మాదిరిగా రిటైర్ అయినా తర్వాత కూడా గోర్డాన్ – కాన్వేల్ థియోలాజికల్ సెమినరీలో గౌరవప్రదమైన పాత్రలో బోధిస్తున్నారు. ఆయన 'విజయవంతమైన జీవితం' అలాగే 'గ్రంథం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం' లాంటి పుస్తకాలను రాశారు.