దేవుడు ప్రేమాస్వరూపి దేవుని పాత్రపై ప్రతిబింబాలు - God is Love [Telugu]
దేవుడు ప్రేమాస్వరూపి దేవుని పాత్రపై ప్రతిబింబాలు - God is Love [Telugu]
ప్రేమను అనుభవించండి!
ప్రేమ అంటే ఏమిటి? కొన్నిసార్లు మనము మన సంబంధాల సందర్భంలో ఈ పదాన్ని అనుబంధించడానికి ప్రయత్నిస్తాము. కానీ ప్రేమ అనేది మానవ భావన కాదు. ఇది దేవుని గుర్తింపు. అది ఒక్కోసారి వైరుధ్యంగా అనిపించవచ్చు. కానీ దేవుడు తన సార్వభౌమత్వం ద్వారా, మనం అనుభవించే ప్రతి పరిస్థితి తన సంరక్షణలో భాగమని వెల్లడిస్తాడు. దివంగత ఓస్వాల్డ్ ఛాంబర్స్ యొక్క జ్ఞానాన్ని మీరు ఆస్వాదిస్తూ, మీ పరలోకపు తండ్రిని కొత్త మార్గంలో చూడటానికి ప్రోత్సహించుకోండి.
ఓస్వాల్డ్ ఛాంబర్స్ స్కాట్లాండ్‌లో జన్మించారు, అతని బాల్యంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. అతని బోధన మరియు ప్రసంగము అతడిని కొంతకాలం అమెరికా మరియు జపాన్‌కు తీసుకెళ్లింది. అతని జీవితంలో చివరి ఆరు సంవత్సరాలు లండన్‌లోని బైబిల్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్‌లోని బ్రిటీష్ కామన్వెల్త్ దళాలకు చాప్లిన్‌గా గడిపారు. అతని మరణం తరువాత, అతని పేరును కలిగి ఉన్న పుస్తకాలను అతని భార్య అతని సంభాషణల యొక్క సంక్షిప్త లిఖితములుగా సంకలనం చేసింది.